Wednesday, July 23, 2014

మమతలకోవెల--1989























సంగీతం::చక్రవర్తి 
రచన::వేటూరి 
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::రాజశేకర్,సుహాసిని,శుభలేఖసుధాకర్ 
      
పల్లవి::

తెలియని రాగం పలికింది..తీయని భావనలో
తెలియని రాగం పలికింది..తీయని భావనలో
మనసే  జ్యోతిగా వెలిగింది..మమతల కోవెలలో
ఈ మమతల కోవెలలలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో 

చరణం::1

ఆకాశ దీపా..నా కోసమే రమ్మని
నా గుండె గుడిగంటలో..నాధానివే నీవని
గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టే శ్రీవారే రావాలని
కుంకుమతో కుశలమని..పారాణే పదిలమని
దీవించు దేవుల్లే..మా ఇంటివారని
తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో
ఈ మమతల కోవెలలలో

చరణం::2

ఏ జన్మకే గమ్యమో..తెలిసేది కాలానికే
ఏ పువ్వు ఏ పూజకో..తెలిసేది దైవానికే
ఏ జన్మకేమైన ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా
బ్రతుకైనా వెతలైనా జతగానే పంచుకునే శ్రీవారే కావాలి ఏ జన్మకైనా
తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగా వెలిగింది మమతల కోవెలలో
ఈ మమతల కోవెలలలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో

No comments: