Tuesday, July 08, 2014

ఆనందభైరవి--1984























సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::S.P.బాలు


పల్లవి :
రా రా రా రాగమై..నా నా నా నాదమై
సంగీతము నేనై వేణువూదగా
నృత్యానివి నీవై ప్రాణదాతగా
రా రా రా రాగమై..నా నా నా నాదమై..ఈ..

చరణం::1
వెదురునైన నాలో నిదుర లేచిన వాయువై
వెదురునైన నాలో నిదుర లేచిన వాయువై
ఎదకు పోసిన ఆయువై..నా గుండియ
నీ అందియగా నా గుండియ నీకే అందియగా
కంకణ నిక్వణ కులుకులు కులుకులు
కలిత చలిత కళ్యాణిరాగమై
కదలి రాగదే భైరవి..కదలి రాగదే భైరవి
నటభైరవి ఆనందభైరవి
రా రా రా రాగమై..నా నా నా నాదమై..ఈ..
చరణం::2
వేణువైన నాలో వేసవిగాలుల వెల్లువై
వేణువైన నాలో వేసవిగాలుల వెల్లువై
ఊపిరి పాటకు పల్లవై భగ్నహృదయమే
గాత్రముగా అగ్నిహోత్రమే నేత్రముగా
దర్శనమివ్వవే స్పర్శకు అందవే
దివ్యదీధితులతో దీపకమై
తరలి రాగదే భైరవి..తరలి రాగదే భైరవి
నటభైరవి ఆనందభైరవి
రా రా రా రాగమై..నా నా నా నాదమై..ఈ..
చరణం::3
నా హృదయనేత్రి విశ్వాభినేత్రి
జ్వలన్నేత్ర ధారాగ్ని తప్తకాంచన కమ్రగాత్రి సుగాత్రి
మద్గాత్ర ముఖ సముద్భూత
గానాహ్వాన చరణచారణ నాట్యవర్తీ సవిత్రీ
ఫాలనేత్ర ప్రభూతాగ్నిహోత్రములోన
పాపసంచయమెల్ల హవ్యమై
ఆ జన్మతపమునకు ఈ జన్మ జపమునకు గాయత్రివై
కదలిరావే సాంధ్యదీపమా ఇదే నయన దీపారాధన
హృదయపూర్వావాహన ఉదయరాగాలాపన
భైరవి నటభైరవి ఆనందభైరవి రావే..రావే..రావే
భైరవి నటభైరవి ఆనందభైరవి రావే..రావే..రావే
రా రా రా రాగమై..నా నా నా నాదమై..ఈ..

No comments: