Sunday, April 03, 2011

జానకిరాముడు--1988

సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు, S.జానకి
నటీ,నటులు::నాగార్జున,విజయశాంతి,సత్యనారాయణ,జీవిత,సుత్తివేలు  

పల్లవి::

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం

నీ పాదాలే రస వేదాలు..నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు..ఏడేడు జన్మాలు…

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు..నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు..ఏడేడు జన్మాలు..ఊఊఊఊ

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
సనిదమ గమదా..నిరిసని గమదా..

చరణం::1

మువ్వలు పలికే మూగతనంలో..మోమున మోహన రాగాలు
కన్నులు పలికే కలికితనంలో..చూపున సంధ్యారాగాలు

అంగ అంగమున అంద చందములు..ఒంపు ఒంపున హంపి శిల్పములు

ఎదుటే నిలిచిన చాలు..ఊఊఊ..ఆరారు కాలాలు…ఊఊఊఊ..

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం

చరణం::2

జతులే పలికే జాణతనంలో..జారే పైటల కెరటాలు
శృతులే కలిసే రాగతనంలో..పల్లవించిన పరువాలు

అడుగు అడుగున రంగవల్లికలు..పెదవి అడుగున రాగమాలికలు

ఎదురై పిలిచినా చాలు..ఊఊఊఊ..ఆఆఆ..నీ మౌన గీతాలు

నీ చరణం కమలం మృదులం..నా హృదయం పదిలం పదిలం
నీ పాదాలే రస వేదాలు..నను కరిగించే నవ నాదాలు
అవి యదలో ఉంచిన చాలు..ఏడేడు జన్మాలు…ఊఊఊఊఊఊ 

No comments: