Wednesday, February 24, 2010

జ్వాల--1985



















సంగీతం::ఇళయరాజ 
రచన::మైలవరపు గోపి 
గానం::S.జానకి 

పల్లవి::

అహా అ హాహా..అహాహా..ఆ ఆ 
ఏవేవో కలలు కన్నాను..మదిలో
ఏవేవో కలలు కన్నాను..మదిలో
మౌన మురళినై..విరహ వీణనై
స్వామి గుడికి చేరువైన వేళలో
ఏవేవో కలలు కన్నాను..మదిలో

చరణం::1

సుడిగాలులలో..మిణికే దీపం
ఈ కోవెలలో..లో..ఎటు చేరినదో
ఏ జన్మలోని బంధమో..ఇదే ఋణానుబంధమో
ఏ జన్మలోని బంధమో..ఇదే ఋణానుబంధమో
నీకు నేను బానిసై..నాకు నువ్వు బాసటై
సాగిపోవు వరమె చాలు 
ఏవేవో కలలు కన్నాను..మదిలో

చరణం::2

నా కన్నులలో..వెలుగై నిలిచీ
చిరు వెన్నెలగా..బ్రతుకే మలిచీ
నిట్టూర్పుగున్న గుండెకీ..ఓదార్పు చూపినావురా 
ట్టూర్పుగున్న గుండెకీ..ఓదార్పు చూపినావురా 

నాది పేద మనసురా..కాంచలీయలేనురా
కనుల నీరె కాంచరా 

No comments: