Friday, February 26, 2010

దేశోద్ధారకులు--1973

సంగీతం::K.V.మహదేవన్ 
రచన::ఆచార్య ఆత్రేయ 
గానం::P.సుశీల

తారాగణం::N.T. రామారావు, వాణిశ్రీ,సావిత్రి,నాగభూషణం, పద్మనాభం

పల్లవి: 

కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు..ఊ..ఊ 
కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు..ఊ..ఊ 
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు..ఊ..ఊ 
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
మరీ పట్టనట్టే ఉన్నారు.. 

చరణం::1

ఆకు చాటున మల్లెలాగ..రేకు విప్పిన కలువలాగ 
ఆకు చాటున మల్లెలాగ..రేకు విప్పిన కలువలాగ 
తడిసీ..ఈ..తడవనీ.. 
తడిసీ..ఈ..తడవనీ..పడుచుపిల్లా తలతలమని మెరుస్తుంటే
దొంగ చూపు చూసి కూడా..చూడనట్టే ఉన్నారూ
దొంగ చూపు చూసి కూడా.. చూడనట్టే ఉన్నారూ
కొత్త పాఠం కోసం ఏమో..ఉత్తషాటే చూస్తున్నారు 

కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
మరీ పట్టనట్టే ఉన్నారు.. 

చరణం::2 

ఈతకోసం వచ్చిన వారు..లోతు చూడక వచ్చేశారు 
గట్టిపోననీ నమ్మీ వస్తే..ఏ..గట్టనెక్కి కూర్చున్నారు
లోతులేని కన్నె మనసున..ఈత నేర్చుకుంటారా..ఆ 
లోతులేని కన్నె మనసున..ఈత నేర్చుకుంటారా..ఆ 
ఓళ్ళు మరచి మునిగినా..నా కళ్ళలోనే తేలుతారు 

కోరుకున్న దొరగారు..కొంగు పట్టుకున్నారు
పట్టుదొరికి..ఎందుకో మరి పట్టనట్టే ఉన్నారు 
మరీ పట్టనట్టే ఉన్నారు..ఊ..

No comments: