Sunday, November 14, 2010

పాల మనసులు--1968

సంగీతం::సత్యం
రచన::డా.సినారె
గానం::పి.బి.శ్రీనివాస్,పి.సుశీల
తారాగణం::హరనాధ్,జమున,గుమ్మడి,చలం,రావికొండలరావు,రమాప్రభ,ఛాయాదేవి,పండరీబాయి

పల్లవి::

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం::1

రెక్కా రెక్కా ఆనించి..రేయి పగలు విహరించి
రెక్కా రెక్కా ఆనించి..రేయి పగలు విహరించి
మిన్నులలో ఎగిసింది..అది వెన్నెలలో తడిసినది
మిన్నులలో ఎగిసింది..అది వెన్నెలలో తడిసినది

ఆ..కోరికలూరే ఆ జంట..ఆరని ఆశల చలి మంట
కోరికలూరే ఆ జంట..ఆరని ఆశల చలి మంట 
చల్లారని ఆశల..చలి మంట

పాలవంక సీమలో గోరువంక వాలింది
గోరువంక పలుకలలో దోర వలపు దొరికింది

చరణం::2

పచ్చని చిలకను చేరగనే..వెచ్చగ ఒదిగెను గోరింక
పచ్చని చిలకను చేరగనే..వెచ్చగ ఒదిగెను గోరింక
ముద్దుల జంటను చూడగనే..ముసిముసి నవ్వును నెలవంక
ముద్దుల జంటను చూడగనే..ముసిముసి నవ్వును నెలవంక

ఆ..కలకలాలాడే ఆ జంట..కమ్మని వలపుల తొలి పంట
కలకలా లాడే ఆ జంట..కమ్మని వలపుల తొలి పంట
కమ్మని వలపుల..తొలి పంట

పాలవంక సీమలో పసిడి చిలక కులికింది
పసిడి చిలక కులుకులలో పాలమనసు దొరికింది

No comments: