Sunday, December 12, 2010

విప్రనారాయణ--1954::హిందోళ:::రాగం










సంగీతం::S.రాజేశ్వరరావ్ 
రచన::సముద్రాల
గానం::A.M.రాజా

హిందోళ:::రాగం 

పల్లవి:: 

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..ఆ..

బృందావనిలో నందకిశోరుడు
బృందావనిలో నందకిశోరుడు
అందముగా దీపించే లీలా

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..ఆ..

చరణం::1

మురళీ కృష్ణుని..మోహన గీతికి 
మురళీ కృష్ణుని..మోహన గీతికి 
పరవశమైనవి..లోకములే..ఏ.. 
పరవశమైనవి..లోకములే..ఏ.. 
విరబూసినవీ..పొన్నలు పొగడలు 
విరబూసినవీ..పొన్నలు పొగడలు
పరిమళ మెగసెను మలయా నిలముల సోలెను యమునా..  

చూడుమదే చెలియా..కనుల
చూడుమదే చెలియా..

చరణం::2

నారీ నారీ నడుమ..మురారి
నారీ నారీ నడుమ..మురారి 
హరికీ హరికీ..నడుమ వయ్యారీ
హరికీ హరికీ..నడుమ వయ్యారీ
తానొకడైనా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
తానొకడైనా..తలకొక రూపై 
తానొకడైనా..తలకొక రూపై
మనసులు దోచే..రాధా మాధవ..కేళీ నటనా

చూడుమదే చెలియా
కనులచూడుమదే చెలియా

No comments: