Thursday, September 06, 2012

లక్ష్మీనివాసం--1968





సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల


పల్లవి::

ధనమే రా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమే రా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమే రా అన్నిటికీ మూలం

చరణం::1


మానవుడే ధనమన్నది స్రుజియించెను రా
దానికి తానె తెలియని దాసుడాయె రా
మానవుడే ధనమన్నది స్రుజియించెను రా
దానికి తానె తెలియని దాసుడాయె రా
ధనలక్ష్మి ని అదుపులోన పెట్టిన వాడే
ధనలక్ష్మి ని అదుపులోన పెట్టిన వాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడు రా

ధనమే రా అన్నిటికీ మూలం


చరణం::2

ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేని నాడు ఒడలు వంచి కూడ బెట్టరా
ఉన్న నాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేని నాడు ఒడలు వంచి కూడ బెట్టరా
కొండలైన కరిగి పోవు కూర్చుని తింటే
కొండలైన కరిగి పోవు కూర్చుని తింటే
అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే

ధనమే రా అన్నిటికీ మూ
లం


చరణం::3

కూలి వాని చెమటలో ధనమున్నది రా
పాలికాపు కండల్లో ధనమున్నది రా
కూలి వాని చెమటలో ధనమున్నది రా
పాలికాపు కండల్లో ధనమున్నది రా
శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసం
శ్రమ జీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం

ధనమే రా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమే రా అన్నిటికీ మూలం

No comments: