Friday, August 17, 2012

అర్థాంగి--1955




సంగీతం::B.నరసింహారావు-అశ్వత్థామ
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::జిక్కి

Film Directed By::P.Pullayya
తారాగణం::అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, గుమ్మడి, శాంతకుమారి

పల్లవి::

ఎక్కడమ్మా చంద్రుడు
ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు
ఎక్కడమ్మా చంద్రుడు
చుక్కలారా అక్కలారా
నిక్కి నిక్కి చూతురేలా
ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::1

చక్కనైనచంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
మబ్బువెనక దాగినాడో మబ్బువెనక దాగినాడో
మనసు లేక ఆగినాడో..ఎక్కడమ్మా చంద్రుడు

చరణం::2

పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పెరుగునాడు తరుగునాడు ప్రేమమారని సామి నేడు
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
పదముపాడి బ్రతిమిలాడి పలుకరించిన పలుకడేమి
చక్కనైన చంద్రుడు..ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాడు..ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు..ఎక్కడమ్మా చంద్రుడు