Wednesday, December 07, 2011

నిర్దోషి--1967

విషాదము వైరాగ్యం తో పాడిన ఘంటసాల గారి ఈ పాట మనం విని తీరాల్సిందే

సంగీతం::ఘటసాల
రచన::సినారె
గానం::ఘంటసాల

మల్లియలారా మాలికలారా..మౌనముగా ఉన్నారామా కధయే విన్నారా

జాబిలి లోనే జ్వాలలు రేగే..వెన్నెల లోనే చీకటి మూగే

పలుకగ లేక పదములు రాక..పలుకగా లేక పదములే రాక
బ్రతుకే తానే బరువై సాగే
మల్లియలారా మాలికలారా..మౌనముగా ఉన్నారా..మా కధయే విన్నారా

చెదరిన వీణ రవళించేనా..జీవనరాగం చివురించేనా

కలతలు పోయి వలపులు పొంగి..కలతలే పోయి వలపులే పొంగి
మనసే లోలో పులకించేనా

No comments: