Monday, November 28, 2011

ఇల్లాలు ప్రియురాలు--1984

చిమ్మటలోని ఈ పాట మీకోసమే వినండి

సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.P.బాలు


పల్లవి::

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం::1

నా బాధ ఇంక తీరేనా
నా గాధ నీకు తెలిసేనా
నీ కంటి లేత కన్నీళ్ళు
నా చేతులార తుడిచేనా
మమతే మనది
ఇక నాలోన నే దాగనా
మూగవీ ఆశలు గుడ్డివీ ప్రేమలు జాలిగా చూడకు
అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని
ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది

చరణం::2

అనుకోని ఘటన ఆనాడు
అందించె నిన్ను ఈనాడు
మా దీపమై నీవు వస్తే
ఈ కోవెలే తలుపులేసే
బ్రతుకే అలిగే ఈ బంధాల కోశారమై
సాగనీ జాతకం ఆడనీ నాటకం
జాలిగా చూడకు అలా చూడకు చూడకు

ఏమని తెలిపేది నేనెవరని చెప్పేది
ఈ బాలచంద్రుడికి ఈ చిన్ని కృష్ణుడికి
ఎలా ఏమని ఏమని

No comments: