Saturday, November 19, 2011

అందాల రాముడు--1973

















సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల



లత:::మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

ANR:::కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా
నవ్వులారబోసే పడుచున్నదీ
కలువ పువ్వు వేయి రేకులతో విచ్చుకున్నదీ
పున్నమి ఎపుడెపుడా అని వేచి ఉన్నదీ

లత:::ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

లత:::కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో ఎగసిపడే తరగలా..
నాజూకు నెలబాలుడున్నాడూ
నవమి నాడే పున్నమి అని దిగుతున్నాడూ
పున్నమి ఇప్పుడిపుడే అనిపిస్తున్నాడూ

ANR:::ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

ANR::కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా

చరణం::1


ఈ వెండి వెన్నెల్లో ఏమిటి ఈ ఎరుపూ
ఎరుపా అది కాదు ఈ అరికాళ్ళ మెరుపూ..

లత:::మ్మ్..

ఆ కాలి ఎరుపు కెంపులుగా
ఆ చిరునవ్వులె మువ్వలుగా
ఆ మేని పసిమి పసిడిగా
అందాలా వడ్డాణం అమరించాలి
అని తలచానే గాని ఆ నడుమేదీ

ఇంతకూ..

అది ఉన్నట్టా..మరి లేనట్టా..
నడుమూ ఉన్నట్టా మరి లేనట్టా..

లత:::ఊహు

ANR:::పైట చెంగు అలలు దాటీ
అలలపై ఉడికే పొంగులు దాటీ
ఏటికి ఎదురీది ఈది ఈది ఎటు తోచక నేనుంటే
మెరుపులాంటి ఎరుపేదో కళ్ళకు మిరుమిట్లు గొలిపింది

ఏమిటది?

చరణం::2

తల:::ఎవరమ్మా ఇతగాడూ ఎంతకు అంతుపట్టని వాడు
చెంతకు చేరుకున్నాడూ
హ హా..ఎవరమ్మా ఇతగాడూ
పాలవెన్నెలలోనా బాలగోదారిలా
చెంగుచెంగున వచ్చి చెయ్యి పట్టబోయాడూ

ANR:::అంతేనా

లత:::తిరగట్లే ఒరుసుకునే వరద గోదారిలా
పరుగు పరుగున వచ్చి పైట చెంగు లాగాడూ

ANR:::ఆపైన

లత:::అతడు చెయ్యపట్టబోతుంటే పైట చెంగులాగబోతుంటే
ఉరిమి చూసీ ఉరిమి చూసీ తరిమి కొట్టబోయాను

కానీ..

చల్లచల్లగా సాగే గోదారిలా శాంత గోదారిలా
నిలువెల్లా నిండుగా తోచాడూ పులకించే గుండెనే దోచాడూ

ఎవరమ్మా ఇతగాడెవరమ్మా

No comments: