Friday, October 28, 2011

ఆఖరి పోరాటం--1988

సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::SP.బాలు,లత మంగేష్కర్

:::::::::

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకెనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై
మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకెనమ్మ జంట ముద్దుల్లో
అహా..తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో

పపప్పా పపప్పా....
వైశాఖం అ తరుముతుంటే నీ ఒళ్లో ఒదుగుతున్నా
ఆశాఢం అ ఉరుముతుంటే నీ మెరుపే చిరుముకున్నా
కవ్వింతనవ్వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే
నీ తోడు కావాలి నే తోడు పోవాలి నీ నీడ లో ఉన్న శృంగారమే
జాబిల్లీ సూరీడూ ఆకాశంలో నీలిన సొగసుల

తెల్ల చీరకు తకధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకెనమ్మ జంట ముద్దుల్లో

కార్తీకం అ కలిసివస్తే నీ పరువం అడుగుతున్నా
హేమంతం హొ కరుగుతుంటే నీ అందం కడుగుతున్న
ఆకాశ గీతాన ఆ మేఘ రాగాలు పలికాయి నా స్వప్న సంగీతమే
ఈ చైత్ర మాసాల చిరు నవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నా కోసమే
గిలిగింతే గీతాలై సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్ల చీరకు తక ధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకెనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా..
ఇలా హాయిగా స్వరాలూదగా..
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్ల చీరకు తక ధిమి తపనలు రేగేనమ్మ సందె ఎన్నెల్లో
సిరి మల్లె పూలకు సరిగమ ఘుమ ఘుమ తాకెనమ్మ జంట ముద్దుల్లో

No comments: