Saturday, July 23, 2011

మహర్షి--1987

సంగీతం::ఇళయరాజా
రచన::వెన్నెలకంటి
గానం::S.P.బాలు

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం..శాసనం దాటటం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘఠనా ఈ పిడికిలిలో తానొదుగునుగా

నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం..హ..
కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలముంటే కామితం తీరకుండా
తప్పనీ ఒప్పనీ తర్కమే చెయ్యనూ
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యనూ
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంటా
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా

సాహసం నా పధం రాజసం నా రధం..సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం..కైవసం కావటం కష్టమా

అదరనీ బెదరని ప్రవృత్తి
ఒదగని మదగజమే మహర్షి

వేడితే లేడి వొడి చేరుతుందా వేట సాగాలి కాదా
వోడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా
అంతమూ సొంతమూ పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండనూ
భీరువల్లే పారిపోను రేయి వొళ్ళో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురు పడునా ఏ అపజయం

No comments: