Sunday, September 20, 2009

మల్లె పందిరి--1981
















పాట ఇక్కడ వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::SP.బాలు,P.సుశీల
నిర్మాణ సంస్థ R.K.మూవీస్


::::::::::::::::::::::::

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే

తొలిచూపు తో రణమాయే..మ్..రాముని తోక..హహహ
"సారీ..అచ్చు తెలుగు నా కంతగా రాదు..అంటే..
అంటే..మిగతా భాషలో పండితుడినని కాదు"..హహహ

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే
తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే

పగడాల పెదవులతోనే..బిడియాలు కలబడుతుంటే
వగలమారి చెక్కిలిమీద..పగటి చుక్క పకప్కమంటే..
శివమై..అనుభవమై..శుభమై..సుందరమై..
శివమై..అనుభవమై..శుభమై..సుందరమై..
కనుచూపు శుభలేఖలుగా..కనుచూపు శుభలేఖలుగా
కల్యణ రేఖలు మెరిసే...

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే
తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే

మనువు..పసుపు..కుంకుమలై..మనువు..గడప దాటుతువుంటే..
కల్కి..బొట్టు..కాటుకలై..కాపురాన అడుగిడుతుంటే..
సిరిగా..శ్రీహరిగా..కలిసే లావిరిలో..
నయనాలు..ప్రియవచనాలై..నయనాలు..ప్రియవచనాలై
అనురాగమే వినిపించే....

తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే
సన్నజాజి తీవలలోనే..సన్నాయి వీణలు పలికే
తొలిచూపు తోరణమాయే..కల్యాణ కారణమాయే

No comments: