Sunday, March 01, 2009

వాడే వీడు--1973




సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన:;దాశరధి
గానం::ఘంటసాల,P.సుశీల

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ...జాబిలీ

అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ జాబిలీ

రేగించే వంటరి వేళలో
వణికించే ఈ చలి గాలిలో..ఓ
రేగించే వంటరి వేళలో
వణికించే ఈ చలి గాలిలో
నా తనువే తడబడుతున్నదీ
చెలిసాయం కావాలన్నదీ
అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ...జాబిలీ

ఒక ఆడది ఒంటిగ దొరికితే
మగధీరులకుండే తెగులిదే..
ఒక ఆడది ఒంటిగ దొరికితే
మగధీరులకుండే తెగులిదే
నీ గడసరి వగలిక చాలులే
..మ్మ్..హు..లోంగే ఘటమిది కాదులే
అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నీ మదిలో కలిగెను అలజడి
జాబిలీ....ఈ....కోమలీ

నీ మదిలో సంగతి తెలుసులే
అది దాచాలన్నా దాగదులే
నీ మదిలో సంగతి తెలుసులే
అది దాచాలన్నా దాగదులే
నువు కోసేవన్నీ కోతలే
నీ పాచికలేవీ పారవులే
అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ....ఓ....జాబిలీ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హే..హే..ఓహో..హో..
హో..

No comments: