Wednesday, January 21, 2009

పండంటి కాపురం--1972















ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::S.P.కోదండ పాణి
రచన::C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,P.సుశీల


ఈ నాడు కట్టుకొన్నా బొమ్మరిల్లూ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఈ నాడు కట్టుకొన్నా బొమ్మరిల్లూ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు


ఆశలే తీవెలుగా..మ్మ్..మ్మ్..ఊసులే పూవులుగా..మ్మ్..మ్మ్..
వలపులే తావులుగా..అలరారు ఆపొదరిల్లు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆశ్లే తీవెలుగా..మ్మ్..మ్మ్..ఊసులే పూవులుగా..మ్మ్..మ్మ్..
వలపులే తావులుగా..అలరారు ఆపొదరిల్లు
పగలైన రేఅయిన..ఏ ౠతువులోనైనా
పగలైన రేఅయిన..ఏ ౠతువులోనైనా
కురిపించును తేనె జల్లూ..పరువాల ఆ పొదరిల్లు

ఈ నాడు కట్టుకొన్నా బొమ్మరిల్లూ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు


కళ్ళలో కళ్ళుంచీ..మ్మ్..హూ..కాలమే కరిగించి..మ్మ్..హూ..
అనురాగం పండించే..ఆ బ్రతుకే హరివిల్లు

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కళలో కళ్ళుంచీ..మ్మ్..హూ..కాలమే కరిగించి..మ్మ్..హూ..
అనురాగం పండించే..ఆ బ్రతుకే హరివిల్లు

నా దేవివి నీ వైతే నీ స్వామిని నేనైతే
నా దేవివి నీ వైతే నీ స్వామిని నేనైతే
పచ్చని మన కాపురమే పరిమళాలు విరజల్లు

ఈ నాడు కట్టుకొన్నా బొమ్మరిల్లూ
కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్



No comments: