Wednesday, June 25, 2008

శ్రీరంగ నీతులు--1983

ఈ పాట వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల

పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
వచ్చేవారం ముచ్చటని రాసిచ్చాను ఎదచాటు
ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో.......

అయ్యో పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
ఊపిరి నీవే అన్నానని మనసిచ్చాను గ్రహపాటు
ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ
ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో......

పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు
అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు

కళ్ళల్లోకి చూస్తే..సంకెళ్ళువేసేస్తావు
నీ పైట చాటూకు వస్తే..చాపల్లే చుట్టేస్తావు
కలలోకి రావద్దన్న..వస్తావు రేయంతా
నీ ప్రేమ ముద్దరలన్ని..పూస్తావు వొళ్ళంతా
సరదాలే ఈవేళ..సరిగమలే..పాడాయి
ఆ మాటే అన్నావు చాలింకా..నీ మోజే మళ్ళింది నావంకా
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో......

పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు
అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు

ఎదురుగ వున్నగాని..ఎదలోకి రమ్మన్నానా
ఎగతాళికన్నాగాని..నను దోచుకోమన్నానా
వగలన్ని చూస్తువుంటే..వయసూరుకొంటుందా
కనుసైగ చేస్తువుంటే..వలపాపుకొంటుందా
సరికొత్తా గుబులేదో..గుండెల్లో రేపేవు
ఈ వింతే పులకింత కావాలీ..నీ చెంతే బ్రతుకంత సాగాలీ

No comments: