Wednesday, April 30, 2008

త్రిమూర్తులు--1987



సంగీతం::బప్పిలహరి
దర్శకత్వం::K.మురళీమోహనరావు
నిర్మాత::శశిభూషణ్
సంస్థ::మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్స్
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::వెంకటేష్,అర్జున్,రాజేంద్రప్రసాద్,శోభన,కుష్బూ,అశ్విని


పల్లవి:

ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము
ప్రేమన్నదే చదరంగము
మనుసులనే పావులుతో ఆటాడుకుంటుంది రోజు
ఆ ఆటలో తానోడినా
అది త్యాగమే అనుకోమని
ఆ నేస్తానికి కన్నీరు తుడిచేది స్నేహం
ఈ స్నేహము చదరంగము

చరణం1:

పసి మనసు కలలు కని పాడింది ఓ పాటను
ఆ ఆ అది పెరిగి నిజమెరిగి అణిగింది తనలో తను
చిననాటి కలలన్ని చెరిపేందుకు విధిరాత చెరలాడెను
ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము

చరణం2:

నీ చూపు నా చూపులోన
కలిసింది ఏ వేళనైనా
నిలిచుంది ఈనాటికైనా
వెలిగింది నా వేదన
ఓ పూవు విరబూయగానే
ఓ గాలి చెలరేగగానే
ఆ తావి తన సొంతమౌనా
ఆ తేనె తన విందుకేనా
చివరికది ఎవరిదని తేల్చేది ఈ స్నేహము

ఈ జీవితం చదరంగము
మనుషులనే పావులుగా ఆటాడుకుంటాము మనము

ఏ కళ్ళలో ఏ కళ్ళలో తెలుపున్నదో నలుపున్నదో
అది తెలిసేంతలో చేజారిపోతుంది ప్రేమ
ఈ జీవితం చదరంగము
ఈ జీవితం చదరంగము

No comments: