Wednesday, December 12, 2007

కొండవీటి దొంగ--1990::శుద్ధ ధన్యసి:::రాగం





సంగీతం:: ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,K.S.చిత్ర
రాగం:::శుద్ధ ధన్యసి


శుభలేకరాసుకొన్న ఎదలో ఎపుడో
అదినీకు పంపుకొన్న అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజచేస్తా
బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో..

శుభలేక అందుకొన్న కలయో నిజమో!
తొలిముద్దు జాబురాసా చెలికే ఎపుడో
శారద మల్లెల పూలజల్లి వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో

!!శుభలేకరాసుకొన్న ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబురాసా చెలికే ఎపుడో !!

ఛైత్రమాసమొచ్చెనేమో చిత్రమైన ప్రేమకీ
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకీ
మత్తుగాలివీచెనేమో మాయదారి చూపుకీ
మల్లెమబ్బులాడెనేమో బాల నీలవేణికీ
మెచ్చి మెచ్చి చూడసాగే గుచ్చె కన్నులూ
గుచ్చి గుచ్చి కౌగిలించె నచ్చె వన్నెలూ
అంతెలే కథంతేలే అదంతేలే.....

!! శుభలేక అందుకొన్న కలయో నిజమో!
తొలిముద్దు జాబురాసా చెలికే ఎపుడో
పుష్యమి పువ్వుల పూజచేస్తా
బుగ్గన చుక్కలతో
ఒత్తిడి వలపులగంధమిస్తా పక్కలలో
శుభలేక అందుకొన్న కలయో నిజమో!
శుభలేకరాసుకొన్న ఎదలో ఎపుడో !!

హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకీ
ప్రేమలేఖ రాసుకొన్నా పెదవిరాని మాటతో
రాధలాగ మూగబోయి పొన్నచెట్టు నీడలో
వేసవల్లె వేచివున్నా రేణుపూలతోటలో
వాలుచూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలూ
వళ్ళోదాటి వెళ్ళసాగె ఎన్నోవాంచలూ
అంతెలే కథంతేలే అదంతేలే.....

!! శుభలేకరాసుకొన్న ఎదలో ఎపుడో
అదినీకు పంపుకొన్న అపుడే కలలో
శారదమల్లెల పూలజల్లి వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధెలు రంగరిస్తా కన్నులతో
శుభలేకరాసుకొన్న ఎదలో ఎపుడో
శుభలేక అందుకొన్న కలయో నిజమో! !!



Kondaveeti Donga--1990
Music::Ilayaraja
Lyricis::Veturi 
Singer's::S.P.Balu , K.S.Chitra

subhalekha rasukunna yedalo epudo
adi neeku pampukunna apude kalalo
pushyami poovula pooja chestaa buggana chukkalatho
othidi valapula gandhamistaa pakkalalo
subhalekha andukunna kalayo nijamo
toli muddu jaabu raasa chelike epudo
sarada mallela poola jalle vennela navvulalo
sravana sandhyanu rangaristaa kannulatho
subha lekha raasukkunna yedalo epudo
toli muddu jaabu raasaa chelike epudo

:::1

chaitramaasamochenemo chitramaina premaki
koyilamma koosenemo gontunichi kommaki
mattugali veechenemo maayadari choopuki
mallemabbulaadenemo baala neelaveniki
mechi mechi choodasage guche kannulu
guchi guchi kougilinche nache vannelu
anthele kadhanthele adanthele........

subhalekha andukunna kalayo nijamo
toli muddu jabu raasa chelike epudo
pushyami poovula pooja chestaa buggana chukkala
ottidi valapula gandhamistaa pakkalalo
subha lekha andukunna kalayo nijamo
subhalekha raasukunna yedalo epudo

:::2

hamsalekha pampaleka himsapadda premaki
premalekha raasukunna pedavi raani mataku
radha laaga moogaboya ponna chettu needalo
vesavalle vechi unna vegu poola thotalo
vaalu choopu mosukoche enno varthalu
vollo daati vellasage enno vanchalu
anthele kadhanthele adanthele

subhalekha raasukunna yedalo epudo
adi neeku pampukunna apude kalalo
sarada mallela poola jalle vennela navvulalo
sravana sandhyanu rangaristha kannulatho
subhalekha raasukunna yedalo epudo
subhalekha andukunna kalayo nijamo 

No comments: