Tuesday, September 25, 2007

దొంగ రాముడు--1955::అభేరి:: రాగం (నట భైరవి::రాగం )





సంగీతం::పెండ్యల నాగేశ్వర రావ్
రచన::సముద్రాల
గానం::P.సుశీల

అభేరి:: రాగం (నట భైరవి::రాగం )
అసావేరి హిందుస్తాని !!

ఆ ఆఅ ఆఆ
అనురాగము విరిసేనా ఓ రే రాజా
అనుతాపము తీరేనా
విను వీధినేలే రాజువే నిరుపేద చెలిపై మనసౌనా

!! అనురాగము విరిసేనా !!

నిలిచేవో మొయిలో మాటునా పిలిచేవో కనులా గీటునా
నిలిచేవో మొయిలో మాటునా పిలిచేవో కనులా గీటునా
పులకించు నాదు డెందము ఏ నాటి ప్రేమాబంధము

!! ఓ రే రాజా....
అనురాగం విరిసేనా !!

మును సాగే మొహాలేమో వెనుకాడే సందేహాలేమో
మును సాగే మొహాలేమో వెనుకాడే సందేహాలేమో
నీ మనసేమో తేటగా తెనిగించవయ్య మహరాజా

!! ఓ రే రాజా
అనురగము విరిసేనా !!

No comments: