Thursday, December 06, 2007

రాక్షసుడు--1991



సంగీతం::ఇళయరాజరచన::వేటూరిగానం::S.P.బాలు,S.జానకి

అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా


:::1


రేతిరౌతుంటే రేగే నాలో కచ్చ
పగటి పూటంతా ఒకటే ఇచ్చ
నిండు జాబిల్లి కైనా వుంది మచ్చ
నీకు లేనందుకే నే మెచ్చా
కాచుకో ఘటొత్కజా కౌగిలే మజా
అందుకే ఇలా వచ్చా చూడవే మజా
చీకటింట చిత్తగించా అందమంతా అప్పగించా
ముద్దుమురిపాలు ముందే ఇచ్చా
ముద్దబంతుల్లో నిన్నే ముంచా !!!

అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా

మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా

:::2


షోకులెన్నెన్నో నీలో నేనే చూశా
మనసుతోపాటు మాటే ఇచ్చా
ఎన్ని రాత్రుళ్ళొ నీకై నేనె వేచా
మనసులోనీకు చోటే ఇచ్చా
ప్రేమపూజకే వచ్చా అందుకో రోజా
చందమామనే తెచ్చా అందుకో రాజా
మోజులన్ని మోసుకొచ్చా ఈడు జోడు రంగరించా
నీకు ప్రేమంటే తెలుసా బచ్చా
నన్ను ప్రేమిస్తే నువ్వే మచ్చా

అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా
ఈడు వచ్చాక ఇట్టా వచ్చా
నువ్వు నచ్చాక నీకే ఇచ్చా
మొదటి గిచ్చుల్లు నిన్నే గిచ్చా
మొగ్గ సిగ్గంతా నేనే తుంచా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా
అచ్చా అచ్చా వచ్చా వచ్చా

No comments: