Saturday, August 04, 2007

మేఘసందేశం--1982::రాగం::శివరంజని

చిమ్మటలోని ఈ ఆణిముత్యం మీకోసం వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::
జేసుదాస్

Film DirectedBy::DasarinarayanaRaoరాగం::శివరంజని!!
కర్నాటక హిందుస్తాని !!


ఆకాశ దేశానఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా

!! ఆకాశ దేశాన !!


రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా

!! ఆకాశ దేశాన !!

No comments: