రాగం::కీరవాణి !!
సంగీతం: ఇళయరాజా
గానం::SP.బాలసుబ్రమణ్యం,మనో,S.జానకి,SP.శైలజ
rachana::రచన::వేటూరి
పి.ఎల్ : రండి రండి రండి..దయ చేయండీ
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ
రండి రండి రండి దయ చేయండీ
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ
శోభన: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు !!
చిరు: అహా !
శోభన: అఁ ! ఇష్ఠులైన వారొస్తే పట్టలేని హుషారు.
పలకరింపుతోనే మనసు మీట గలరు.
ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరూ.
పి.ఎల్ : తమరేనా సూర్య. ఇలా కూర్చోండయ్యా !!
ఆగండాగండాగండి. వద్దు కూర్చోకండక్కడ!!
తగిన చోటు కాదది తమబోటివారికిక్కడ.
శోభన: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య.
గడపదాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య.
పి.ఎల్ : క్లైంట్లు, కంప్లైంట్లూ..
క్లైంట్లు, కంప్లైంట్లూ మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గానకళకు దర్బారు.
పి.ఎల్ : రండి రండి రండి..దయ చేయండీ
శోభన: తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ
పి.ఎల్ : బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రు మంటూ
బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రు మంటూ చిర్రు బుర్రు లాడటం కుర్చీలకు ఆచారం.
ఆత్మీయులు వచ్చినపుడు ఆ చప్పుడు అపచారం.
వచ్చిన మితృలకోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించా !!
కచేరీలు చేసే కుర్చీ ఇది. ఎలా ఉంది?
చిరు: హుఁ , బాగుందండి !!
పి.ఎల్ : గానకళ ఇలవేల్పుగా ఉన్న మా ఇంటా..
శునకమైనా పలుకు కనకాంగి రాగాన !
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా..
గాలైన కదలాడు సరిగమల త్రోవా..
పి.ఎల్ : రావోయ్ రా ! ఇదుగో ఈయనే సూర్య ! " ఈమె నా భార్య "!
ఈ ఇంటికి ఎదురులేని ఏలిక నా మిస్సెస్సూ..
ఆర్గ్యుమెంటు వినకుండా తీర్పిచ్చే జస్టిస్సూ..
పి.ఎల్ భార్య : చాల్లేండి సరసం ! యేళ్ళు ముదురుతున్న కొద్దీ..
పి.ఎల్ : తిడితే తిట్టేవు కాని తాళంలో తిట్టూ..
తకతోం తకతోం తరిగిటతోం థక తకిటతోం !!
స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు.
పి.ఎల్ భార్య : తడతా పెడతా పొగపెడతా ఉడకపెడతా !!
కొత్తవాళ్ళ ముందేవిటి వేళాకోళం ! ఎవరేమనుకుంటారో తెలియని మేళం !!
శోభన: ఎవరో పరాయివారు కాదమ్మా ఈయనా !!
సూర్యం గారని చెప్పానే ఆయనే ఈయన !!
పి.ఎల్ భార్య : ఆహఁ ! రండి రండి రండి..దయ చేయండీ
అందరూ : తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ
పి.ఎల్ నాన్న: ఖళ్ ఖళ్ ఖళ్ ఖళ్ !
పి.ఎల్ : వ్రుద్దాప్యంతో మంచం పట్టి తాళం తప్పక దగ్గటమన్నది
అంచెలంచలుగ సాధించిన మా తండ్రి పెంచలయ్యా !!
ఖళ్ళూ ఖళ్ళున వచ్చే చప్పుడు..
ఘల్లూ ఘల్లున మార్చే విద్యా..
కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్యా !!
శోభన: ఇదుగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవీ !!
పి.ఎల్ : దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం !!
మా ఇంట్లో సందడికీ ఈ పిల్లే పల్లవి.
పనమ్మాయి : రండి రండి రండి దయ చేయండీ
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ
డింగ్ డింగ్..డింగ్ డింగ్ (డోర్ బెల్)
పోస్ట్మాన్ : పోస్ట్ పోస్ట్ ! పోస్ట్ పోస్ట్ !!
వావిలాల వరాలయ్య బి.అ.ఎల్.ఎల్.బి పోస్ట్ పోస్ట్ ! పోస్ట్ పోస్ట్ !!
పి.ఎల్ : మాఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లూ
అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లూ !!
చిలుక: రండి రండి రండి..రండి రండి రండి !!
శోభన: మాకు నిలయ విద్వాంసులు చిలకరాజు గారూ..
కీరవాణి వీరిపేరు పలుకు తేనెలూరూ..
పి.ఎల్ : నవ్వు మువ్వ కట్టీ..ప్రతి నిముషాన్నీ తుళ్ళిస్తూ
సంబరాల సీమలోకి ప్రతి అడుగూ మళ్ళిస్తూ
ఇదే మాదిరి సుధామాధురి పంచడమే పరమార్ధం !!
అదే అదే నా సిద్దాంతం ! !
చిరు: గానం అంటే ఒక కళగానే తెలుసిన్నాళ్ళూ నాకూ..
బ్రతుకే పాటగ మార్చినందుకూ జోహారిదిగో మీకూ..
సంగీతంతో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళూ..
సంగీతంలో మాటలాడటం .. దా దా పదా పదా పదా !!
మాటలనే సంగతులు చేయటం పనీ..పని పని సరి..పని సరిగా !!
సంగతులే సద్గతులనుకొనడం సరి
సరి సరి సరి సరి సరిగా సరిగ సరిగా తెలుసుకొన్నాను ఈనాడూ
సెలవిప్పిస్తే వెళ్ళొస్తా..
మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటా..ఆ ! హా !
No comments:
Post a Comment