Sunday, August 05, 2007

గోపాలుడు భూపాలుడు--1969


సంగీతం:: M.S.P.కోదండపాణి
రచన:: ఆరుద్ర
గానం:: ఘంటసాల,S. జానకి

గొల్ల గోపన్న …. ఒకసారి కలలోకి రావయ్యా
ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …

ఒకసారి రాగానే ఏమౌనులే ..
నీ హృదయాన శయనించి ఉంటానులే ..
ఏలుకుంటానులే …
ఒకసారి రాగానే ఏమౌనులే

పగడాల నా మోవి చిగురించెరా ..
మోము చెమరించెరా .. మేను పులకించెరా
సొగసు వేణువు చేసి పలికించరా
సొగసు వేణువు చేసి పలికించరా

కెమ్మోవి పై తేనె ఒలికించనా …
కెమ్మోవి పై తేనె ఒలికించనా
తనివి కలిగించనా .. మనసు కరిగించనా
కేరింతలాడించి సోలించనా … కేరింతలాడించి సోలించనా
ఒకసారి కలలోకి రావయ్యా

ఒంపుసొంపుల మెరుపు మెరిపించవే
వగలు కురిపించవే … మేను మరపించవే
మరపులో మధుకీల రగిలించవే ..
మరపులో మధుకీల రగిలించవే

చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా ..
చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా
మొగ్గ తొడిగిందిరా .. మురిసి విరిసిందిరా
పదును తేలిన వలపు పండించరా
పదును తేలిన వలపు పండించరా

ఒకసారి కలలోకి రావయ్యా
నా ఉవ్విళ్ళు కవ్వించి పోవయ్యా
ఓ గొల్ల గోపయ్యా …
ఒకసారి రాగానే ఏమౌనులే ..

No comments: