సంగీతం::పెండ్యాల
రచన::సినారె
గానం::P.లీల,P.సుశీల
రాగం::::హంసధ్వని
పల్లవి::
స్వాగతం..
స్వాగతం సుస్వాగతం..
స్వాగతం కురుసార్వబౌమ్య స్వాగతం సుస్వాగతం
శతసోదర సంసేవిత సదన..అభిమాన సదా సుయోధనా..ఆ..
స్వాగతం సుస్వాగతం..
చరణం::1
మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వలరాజువు నీవే
మచ్చలేని నెలరాజువు నీవే
మనసులోని వలరాజువు నీవే
రాగ భోగ సురరాజువు నీవే..ఆ.ఆ..ఆ.ఆ
ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
రాగ భోగ సురరాజువు నీవే..రాజులకే రారాజువు నీవే
ధరణిపాల శిరో మకుట మణి తరుణ కిరణ పరి రంజిత చరణా
స్వాగతం....సుస్వాగతం...
చరణం::2
తలుపులన్ని పన్నీటి జల్లులై
వలపులన్ని విరజాజి మల్లెలై
ఆ ఆ అ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ అ ఆ ఆ ఆ
తలుపులన్ని పన్నీటి జల్లులై
వలపులన్ని విరజాజి మల్లెలై
నిన్ను మేము సేవించుటన్నవీ
ఎన్ని జన్మముల పుణ్యమో అది
కదన రంగ బాహు దండ సుధ గదా ప్రకట పటు శౌర్యాభరణ
స్వాగతం..సుస్వాగతం..
No comments:
Post a Comment