Thursday, August 16, 2007

సిరి సంపదలు--1963



సంగీతం::మాష్టర్ వేణురచన::ఆచార్య ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

ఎందుకో....సిగ్గెందుకో..ఇంతలోనే అమ్మాయికి
అంత సిగ్గు ఎందుకో...ఎందుకో....సిగ్గెందుకో
పంతాలే తీరెనని తెలిసినందుకే..
మనసులు కలసినందుకే
అందుకే...సిగ్గందుకే....!!!!!

చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు
చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు
చిరునవ్వుల చిన్నారీ...చిరునవ్వుల చిన్నారి
ఇంకా సిగ్గెందుకే..ఎందుకో సిగ్గెందుకో... !!!!

కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై
తనివారగ ఈ వేళా...తనివారగ ఈ వేళా
మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే !!!


నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
అనురాగం ఆనందం...అనురాగం ఆనందం
అన్నీ నీ కోసమే...
అందుకా ఆ...సిగ్గందుకా ఆ...
పంతాలు తీరెనని తెలిసినందుకా
మనసులు కలిసినందుకే...అందుకా సిగ్గందుకా..మ్మ్..హు...

No comments: