Monday, July 02, 2007

అప్పుచేసి పప్పుకూడు--1958::మోహన:::రాగం





డైరెక్టర్::LV.ప్రసాద్
రచన::పింగళి నారాయణ రావ్
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::ఘంటసాల,లీల


మోహన:::రాగం

ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ....
తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ
ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ ....
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ
మనసు మీద హాయిగా ఆ ఆ ఆ ....
మనసు మీద హాయిగా
తీయగా మాయగా మత్తుమందు జల్లుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి

హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
హృదయవీణ మీటుతూ ప్రేమగీతి పాడుతూ
ప్రకృతినెల్ల హాయిగా ఆ ఆ ఆ . ..
ప్రకృతినెల్ల హాయిగా
తీయగా మాయగా పరవశింపజేయుచు
ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి
ఈ చల్లని గాలి.

No comments: