Saturday, June 02, 2007

ముందడుగు--1958




సంగీతం::K.V.మహదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::మాధవపెద్ది సత్యం,జిక్కి

Film Directed By::Krishna Rao
తారాగణం::జగ్గయ్య,,R..నాగేశ్వరరావు,కుటుంబరావు,బాలకృష్ణ,జానకి,గిరిజ,హేమలత,సీత. 

పల్లవి::

కోడెకారు చిన్నవాడా
వాడిపోని వన్నెకాడా
కోడెకారు చిన్నవాడా
వాడిపోని వన్నెకాడా
కోటలోనా పాగా వేసావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా

చింత పూల రైక దానా
చిలిపి చూపుల చిన్నాదానా
చింత పూల రైక దానా
చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా
చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా
చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా
చల్ నవ్వుల రాణీ
దోరవలపుల దోచుకున్నావా

చరణం::1

చెట్టు మీద పిట్ట ఉంది
పిట్ట నోట పిలుపు ఉంది
చెట్టు మీద పిట్ట ఉంది
పిట్ట నోట పిలుపు ఉంది
పిలుపు ఎవరికో తెలుసుకున్నావా
చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా
చల్ పువ్వుల రంగా
తెలుసుకుంటే కలిసి ఉంటావా

పిలుపు విన్నా తెలుసుకున్నా
పిల్లదానా నమ్ముకున్నా
పిలుపు విన్నా తెలుసుకున్నా
పిల్లదానా నమ్ముకున్నా
తెప్పలాగా తేలుతున్నానే
చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా
చల్ నవ్వుల రాణీ
నాకు జోడుగా నావా నడిపేవా

చరణం::2

నేల వదిలి నీరు వదిలి
నేను నువ్వను తలపు మాని
నేల వదిలి నీరు వదిలి
నేను నువ్వను తలపు మాని
ఇద్దరొకటై ఎగిరిపోదామా
చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా
చల్ పువ్వుల రంగా
గాలి దారుల తేలి పోదామా

ఆడదాని మాట వింటే
తేలిపోటం తేలికంటే
ఆడదాని మాట వింటే
తేలిపోటం తేలికంటే
తేల్చి తేల్చి ముంచుతారంటా
చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా
చల్ నవ్వుల రాణీ
మునుగుతుంటే నవ్వుతారంటా

కోడె కారు చిన్న వాడా
వాడిపోని వన్నె కాడా
కోటలోనా పాగా వేసావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా
చల్ పువ్వుల రంగా
మాటతోనే మనసు దోచావా

చింత పూల రైకదానా
చిలిపి చూపుల చిన్నాదానా
కోరికలతో కోటే కట్టావా
చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా
చల్ నవ్వుల రాణీ
దోర వలపుల దోచుకున్నావా

No comments: