ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ... ఎవరికి తెలుసు... ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు... మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ జగతికి హృదయం లేదని ఈ జగతికి హృదయం లేదని నా జన్మకు ఉదయం లేనే లేదనీ ఆ..ఆ..ఆ..ఆ.. ఎవరికి తెలుసూ.. ఎవరికి తెలుసు.. చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసూ గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం ప్రేమకు మరణం లేదని నా ప్రేమకు మరణం లేదని నా తోటకు మల్లిక లేనే లేదనీ ఆ..ఆ..ఆ..ఆ.. ఎవరికి తెలుసూ ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసూ
చిన్న మాటా..ఆ..ఆ.. ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా సందె గాలి వీచే....సన్నజాజి పూచే జలదరించే చల్లని వేళ.... చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా ఆ....చిన్న మాటా....ఆ..ఒక చిన్నమాటా రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మాఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట....మాట చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ వాలు చూపే నీలాల మెరుపై విరితేనెలే వెల్లువాయే అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట....మాట చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా సందె గాలి వీచే సన్నజాజి పూచే సందె గాలి వీచే సన్నజాజి పూచే జలదరించే చల్లని వేళ చిన్న మాటా ఒక చిన్న మాటా
ఓహో...ఓహో...లలితా... నా ప్రేమ కవితా..నా ప్రేమ కవితా... గగనవీణ సరిగమలు పాడగా..ఆ..ఆ..ఆ.. నీ జఘనసీమ స్వరజతలనాడగా..ఆ..ఆ..ఆ.. ఫెళఫెళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లగ కదలగా...కనులు చెదరగా కదలిరా...కవితలా...వలపుకే వరదలా.. ఓహో...ఓహో...లలితా...నా ప్రేమ కవితా
మల్లెపువ్వులో మధువు పొంగులా వెల్లువైన కవితా నీ కన్నెవయసు నా ఇంద్రధనుసుగా కదలిరావె నా లలితా గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా నీ అందాలే మకరందాలై... మల్లె సుగంధం నాలో విరిసే... సిగ మల్లె పిలుపులే అందుకో... సిరి మల్లె తీగవై అల్లుకో... ఈ మల్లెపూవే నీ సొంతమూ... కదలిరా...కవితలా...వలపుకే వరదలా ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా వయసుతోటలో మనసుపాటలా వెల్లివిరిసెలే నీ కథా నా అణువు అణువు నీ వలపు వేణువై ఝల్లుమన్నదీ నా ఎదా తెలుగుపాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా పూలఋతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా నీ ఊహలలో నే ఊర్వశినై... నీ కౌగిలికే నే జాబిలినై... నీ కాలిమువ్వ నా కవితగా... నా దారి దీయనీ మమతగా... ఈ మల్లెపూలే నా లలితగా... కదలిరా..కవితలా..వలపుకే వరదలా... ఓహో...ఓహో...లలితా...నా ప్రేమ కవితా..
సంగీతం::చక్రవర్తి రచన::వేటూరి గానం::S.P.బాలు ఓ ప్రియా...ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినదీ సఖియా..ఆ..ఆ.. నీవెంతటి వంచన చేసావు సిరిసంపదకమ్ముడు పోయావు విడనాడుట నీకు సులభం విడనాడుట నీకు సులభం నిను విడువదులే నా హృదయం ఓ ప్రియా....మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినదీ తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు చెలి చేసిన గాయం మానదులే చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదులే ఓ ప్రియా....మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినదీ
ఆలయమన్నది లేదని నీకై అల్లెను గుడులను సాలీడు ఆ భక్తుడు నీవు సంశోధించ అగ్నిపరీక్షను పొందాడు నీ గుడి రూపము చెరిపిన దీపము మ్రింగ దలంచెను పురుగు ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది ముక్తినొసంగిన దేవా ॥
పన్నగ మొక్కటి ప్రతి ఉదయమ్మున ఎన్నో మణులను తెచ్చేదీ నిన్నే పూజించేదీ పాముయొనర్చిన పూజను మెచ్చక ఏనుగు దానిని తుడిచేదీ వేరే పూజలు చేసేదీ ఒకరు యెనర్చిన పూజలునొల్లనొ కరికాళమ్ములు పగబూనీ తరుణము కొరకై వేచినవీ తొండము నుండి దూరిన పాము మెండుగ గజమును బాధించే కొండను మోదగ కుంభము పగులగ రెండొక తరి మరణించె నీకై పోరిన ఆ ప్రాణులకు నీ సాయుజ్యము లభియించే జంతుసంతతికి ఇచ్చిన మోక్షము సదాశివా దయచేయవా ॥