సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆత్రేయ గానం::S.P.బాలు తారాగణం::శోభన్ బాబు,జయచిత్ర,జయసుధ,అంజలీదేవి,రమాప్రభ,సత్యనారాయణ, రాజబాబు,నగేష్ పల్లవి:: ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా చరణం::1 నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు అన్యాయం అన్యాయం అంటే వెళ్ళి దేవుడితో చెప్పుకో పొమ్మన్నాడు పో పొమ్మన్నాడు ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ శ్రీనివాసా చరణం::2 చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు చట్టం ఒప్పుకుని యిద్దరం కలవలేదు చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు చట్టం ఒప్పుకుని యిద్దరం కలవలేదు మనిషి చేసింది చట్టము మాకు జరిగింది ద్రోహము నువ్వే నిలబెట్టాలి నీతీ న్యాయమూ లేదా నువ్వే శూన్యము ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ శ్రీనివాసా చరణం::3 మాటమీద నిలబడే మనిషినీ మనసు మార్చుకోను చేతకాని వాడినీ మాటమీద నిలబడే మనిషినీ మనసు మార్చుకోను చేతకాని వాడినీ చేపట్టి విడువలేను ఆడదానిని నీ మీద ఒట్టు నేనొంటరివాడ్ని ఒంటరివాడ్ని ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
కారున్న మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరూ.. మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తాళాలు "హత్తేరీ "
పదునైన కన్నెపిల్ల ఎదురైతే పల్లికిలించి ప్రేమపాఠలేన్నో చెపుతారు పదునైన కన్నెపిల్ల ఎదురైతే పల్లికిలించి ప్రేమపాఠలేన్నో చెపుతారు పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటరూ పెళ్ళాడమంటేనే గొప్పోళ్ళమంటారు మా ప్రేమ ముందు బీదోళ్ళు మీరేనంటారు
కారున్న మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరూ.. మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తాళాలు
నీవేంట నేనొస్తే నీ డబ్బు చూస్తాను నా వేంత నీవు వొచ్చేవా లోకాన్ని చూస్తావు లోకాన్ని చూడందే నీవ్ మనిషివి కాలేవూ లోకాన్ని చూడందే నీవ్ మనిషివి కాలేవూ మా వాడివైతే కలకాలం బ్రతికుంటావు "హత్తేరీ " కారున్న మైనరు కాలం మారింది మైనరు ఇక తగ్గాలి మీ జోరూ.. మా చేతికి వచ్చాయి తాళాలు మా చేతికి వచ్చాయి తాళాలు "హత్తేరీ"