మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు నాటక రంగానివే మనసా..తెగిన పతంగానివే ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో ఎందుకు రగిలేవో..ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. ఓ మూగ మనసా
కోర్కెల సెల నీవు ఊరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా..మాయల దెయ్యానివే లేనిది కోరేవు..ఉన్నది వదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా మౌనమే నీ భాష ఓ మూగ మనసా తలపులు ఎన్నేన్నో కలలుగ కంటావు కల్లలు కాగానే కన్నీరౌతావు
No comments:
Post a Comment