రాము--1968
సంగీతం::R.గోవర్ధనం::
రచన::దాశరధి
గానం::ఘంటసాల
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా ఈ శిలపై రాలిన ఫలమేమి
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
ఆకాశానికి అంతుంది నా ఆవేదనకూ అంతేది
ఆకాశానికి అంతుంది నా ఆవేదనకూ అంతేది
మేఘములోన మెరుపుంది నా జీవితమందునా వెలుగేదీ
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై ఇకపై తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా ఒక చిన్న గులాబి విరిసేనా
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
మదిలో శాంతి లేనపుడు ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం నా వొసటను రాయుట మరిచాడు
మంటలు రేపే నెలరాజా ఈ తుంటరి తనము నీకేలా
No comments:
Post a Comment