Monday, April 04, 2011

నవ ఉగాది...


ముందు అందరూ నన్ను క్షమించండి __/\__

కవితలంటే నాకు కాస్తపిచ్చే అనుకోండి

అప్పుడప్పుడు నాకూ రాయాలనే ఆవేశం కలుగుతూవుండేది

కాని ధైర్యం చాలక..రాసినవి పిచ్చిగా వుంటే????

ఇలాంటి భయాలతో రాసుకొన్నవన్నీ...

బుక్కులోనే పదిలపరుచుకొనేదాన్ని...!!!

ఎప్పుడో.....రాసిన ఒక కవిత ఇవాల దైర్యం చేసి

మీముందు వుంచబోతున్నాను తప్పులున్నా క్షమించమని ప్రాథన...










నవ ఉగాది...

సముద్రములోని కడలిలా...
పున్నమి జాబిల్లిలా...
నవ వధువు హంస నడకలా..
కదలికదలి వస్తుంది ఉగాది..
ఓరచూపుల లేతవన్నెల చిరువేపాకుతో..
నునుసిగ్గుల దోరవలపు పుల్లదనంతో..
చిరునవ్వుల ధరహాసపు తీయదనంతో..
కలబోసిన నవరుచుల నవయవ్వనంతో..
చిగురించిన ప్రకృతికి సరికొత్త పులకింతలురేపుతూ
గగన తారలా కాంతుల్ని విరజిమ్ముతూ..
వసంత ౠతువు కోయిలల శ్రావ్య గానాలతో
కదలి కదలి వస్తుంది ఉగాది..
పోయిన ఏడు తీరని ఆశయాలకు నాందిపలుకుతూ...
కొత్తసంవత్స్సరం కోటి కోర్కెలతో చెప్పాలి మనం ..
ఉగాదికి స్వాగతం...సుస్వాగతం....


7 comments:

  1. చాలా చాలా చాలా బాగుంది. నిజంగా!!
    ఉగాది రుచుల్నీ , నవవధువు హావభావాల్నీ చాలా చక్కగా పోల్చారు.

    ReplyDelete
  2. ఓ...!!! THANK YOU SO MUCH మందాకినీ

    ఎలాంటి కామెట్స్ వస్తాయో అని భయంగా వుండేది

    హమ్మయ్యా...కాస్త ఊపిరాడ్తావుంది ఇప్పుడు :)

    ReplyDelete
  3. ఓరచూపులు చిరువేపాకు ఎందుకయ్యాయో తెలీలేదు కానీ, మిగతా పోలికలు భలే ఉన్నాయి.

    ReplyDelete
  4. ఎదో మనసుకు వచ్చింది రాసాను మందాకినీ... :(

    అదే పనిగా ఆలోచించి రాయలేదు...

    ఒకసారి ఉగాదికి మా Friend ఇంటికి వెళ్ళాము

    పొద్దునే వెళ్ళిపోయాము కాస్త help చేద్దామని

    మా Friend గుమ్మానికి తోరణాలు కడుతూ...

    వాళ్ళాయన్ని వేపాకు కొమ్మలు పట్టుకొని

    ఉడికిస్తూ ఓరగా చూస్తూ బాగా ఏడిపిస్తా వుంది

    వాళ్ళిద్దరు ఆడుకోవడం ఎలాగైనా వుండని ,

    నాలో ఆ క్షణ కలిగిన ఆవేశమే...ఓరచూపులు చిరువేపాకు

    కలిపాను...ఇదీ...మరి ...నా Friend కుడ చూసి

    టిపి లో వెయ్యమని అడిగింది కాని ఇదో ఇలాంటి తప్పులతో భయపడి

    ( టీపిలో పెద్ద పెద్ద అఖండులు ఉన్నారని భయం )

    రాసినవి వేయలేకపోయాను సారి మందాకినీ :(((

    తప్పును దిద్దుకొంటాను (మరి ఎలాగో తెలియటం లేదు) :(??

    ReplyDelete
  5. మీరు మార్చాలని చెప్పటంలేదు. భావుకులకు భావావేశమే అందం. ఆలోచించి వ్రాయటం కాకపోవచ్చు. కానీ అందమైన మీ భావాలకు అలంకారాలు చేసే ప్రయత్నం.అంతే.

    వాలుకన్నుల ఓరచూపుల వగరుదనంతో
    అలరించే అలకల్లో చిరు చేదుదనంతో

    ReplyDelete